వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. పింఛన్ పెంపు!
- రూ. 2,225 నుంచి రూ. 2,500కు పింఛన్ పెంపు
- జనవరి 1 నుంచి పెరగనున్న పింఛన్
- ఈ నెల 21న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభం
ఈ సందర్భంగా పలు వివరాలను జగన్ తెలిపారు. ఈ నెల 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 9న ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈబీసీ నేస్తం పథకం వల్ల అగ్రవర్ణ నిరుపేద మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. 45 నుంచి 60 ఏళ్ల వయసున్న నిరుపేద మహిళలకు మూడేళ్లలో రూ. 45 వేల చొప్పున ఆర్థికసాయం చేయనున్నారు. జనవరిలో రైతు భరోసా సాయాన్ని కూడా అందజేస్తామని చెప్పారు. అయితే రైతు భరోసా ఇచ్చే తేదీని త్వరలో ప్రకటించనున్నారు.