స్పెషల్ సాంగ్స్ చేయను: రష్మిక

Pushpa movie update
  • 'పుష్ప'లో బన్నీ సరసన రష్మిక 
  • శ్రీవల్లి పాత్రలో సందడి 
  • ప్రత్యేక గీతంలో సమంత 
  • ఈ నెల 17వ తేదీన విడుదల 
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ రేసులో రష్మిక ఉంది. వరుస సినిమాలతో .. వరుస హిట్లతో ఆమె దూసుకుపోతోంది. ఆమె తాజా చిత్రమైన 'పుష్ప' ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి చెప్పింది.

"ఈ సినిమాలో నేను శ్రీవల్లి పాత్రను పోషిస్తున్నట్టుగా ఇప్పుడు ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. అంతలా ఈ పాత్ర పేరు జనంలోకి వెళ్లింది. తెరపై శ్రీవల్లి కాస్త క్యూట్ గా .. మరికాస్త కన్నింగ్ గా కనిపిస్తుంది. ఇంతవరకూ నేను చేసిన పాత్రల్లో నాకు బాగా నచ్చిన పాత్ర ఇది. ఈ పాత్రకి పడే మార్కులు అన్నీ కూడా సుక్కూ సార్ కే వెళతాయి.

'సామీ సామీ' సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం .. కాకపోతే ఆ పాట మూమెంట్స్ చాలా కష్టంగా అనిపించాయి. ఆ పాట కోసం చాలా హార్డు వర్క్ చేయవలసి వచ్చింది. సమంత చేసిన స్పెషల్ సాంగ్ హైలైట్ అవుతుంది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూసి నేను షాక్ అయ్యాను. నాకు మాత్రం స్పెషల్ సాంగ్స్ చేయాలనే ఆలోచన లేదు" అని చెప్పుకొచ్చింది.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sunil
Pushpa Movie

More Telugu News