గాల్లో చక్కర్లు కొట్టి భయపెట్టిన విమానం.. అందులో కర్ణాటక సీఎం బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
- బెంగళూరు నుంచి హుబ్బళ్లికి బయలుదేరిన సీఎం
- హుబ్బళ్లి ల్యాండింగ్‌కు అనుకూలించని వాతావరణం
- గాల్లోనే విమానం చక్కర్లు
- అరగంట తర్వాత సురక్షితంగా ల్యాండింగ్
వీరు ప్రయాణిస్తున్న విమానం హుబ్బళ్లికి చేరుకునే సరికి వాతావరణం సంక్లిష్టంగా మారింది. మంచు దట్టంగా కమ్ముకోవడంతో రన్‌వే కనిపించలేదు. ఫలితంగా ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దీంతో విమానాన్ని మంగళూరు తరలించాలని భావించారు. ఈ క్రమంలో విమానం అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత వాతావరణం అనుకూలించడంతో విమానం ల్యాండ్ అయింది. దీంతో అప్పటి వరకు ఉత్కంఠగా గడిపిన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.