'ప్రాజెక్ట్ K' కోసం ప్రభాస్ రంగంలోకి దిగిపోయాడట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ప్రాజెక్ట్ K' కోసం ప్రభాస్ రంగంలోకి దిగిపోయాడట!

Project K movie  update
  • 'ఆది పురుష్' పూర్తిచేసిన ప్రభాస్
  • ముగింపు దశకి చేరుకున్న 'సలార్'
  • షూటింగు మొదలెట్టేసిన 'ప్రాజక్ట్ K'
  • దర్శకుడిగా నాగ్ అశ్విన్
ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను ఒప్పేసుకుంటూ వెళ్లాడు. ఒకదానికి మించిన భారీ సినిమా మరొకటి కావడంతో, ఈ సినిమాలు ఎప్పటికి పూర్తికావాలి? అని అంతా అనుకున్నారు. కానీ ఆల్రెడీ 'ఆదిపురుష్'ను పూర్తిచేసిన ప్రభాస్, 'సలార్'ను కూడా ముగింపు దశకి తీసుకుని వచ్చేశాడు.

అంతేకాదు .. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' ను కూడా పట్టాలెక్కించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా, కొన్ని రోజులుగా హైదరాబాద్ లో షూటింగు జరుపుకుంటోంది. కొన్ని రోజులుగా దీపిక పదుకొణేకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ రోజునే ఈ సినిమా షూటింగులో ప్రభాస్ జాయినైనట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన బల్క్ డేట్స్ కేటాయించాడని అంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ప్రభాస్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అమితాబ్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాకి, సింగీతం శ్రీనివాసరావు క్రియేటివ్ హెడ్ గా ఉండటం విశేషం.
Prabhas
Deepika Padukone
Project K Movie

More Telugu News