'పుష్ప' టీమ్ కి కానుకలు ఇచ్చిన బన్నీ!
- సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప'
- అడవి నేపథ్యంలో సాగే కథ
- ఈ నెల 17వ తేదీన విడుదల
- డైరెక్షన్ శాఖలోని వారికి గోల్డ్ రింగ్స్
షూటింగు సమయంలోనే ఈ సినిమా కరోనా పరిస్థితులను ఎదుర్కొంది. ఆ తరువాత భారీ వర్షాల వంటి అవాంతరాలను చూసింది. పైగా ఈ సినిమా కథ నేపథ్యం కారణంగా అడవిలోనే ఎక్కువగా షూటింగు చేయవలసి వచ్చింది. అందువలన ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారట.
అందువలన బన్నీ ఫస్టు పార్టు విడుదలకి దగ్గరవుతున్న వేళ, వాళ్లను అభినందించాడట. అంతేకాకుండా డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేసినవారికి గోల్డ్ రింగ్స్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇతర సిబ్బందికి నగదు రూపంలో ఇవ్వడం జరిగిందని అంటున్నారు. ఇలా తమ సినిమా టీమ్ కి గిఫ్టులు అందించడమనేది తమిళంలో అజిత్ .. విజయ్ ఎక్కువగా చేస్తుంటారు.