Pushpa: 'పుష్ప' నుంచి మరో అప్డేట్!

  • ఈ నెల 17న విడుదల కానున్న 'పుష్ప'
  • అదే రోజు విడుదల కానున్న హిందీ వర్షన్
  • అల్లు అర్జున్ సరసన నటించిన రష్మిక మందన్న
Pushpa hindi version to release on December 17

అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా చిత్రం 'పుష్ప' ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే కొన్ని కారణాల వల్ల హిందీ వర్షన్ విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. డబ్బింగ్ రైట్స్ కారణంగా 17న సినిమా విడుదల కాకపోవచ్చని చెప్పారు. అయితే ఈ వార్తలకు మేకర్స్ చెక్ పెట్టారు. హిందీ వర్షన్ కూడా ఈ నెల 17నే విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారాయి. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 6న విడుదల చేయనున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More Telugu News