Nagarjuna: బంగార్రాజు నుంచి 'నా కోసం' లిరికల్ సాంగ్!

  • షూటింగు దశలో 'బంగార్రాజు'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • నాగలక్ష్మి పాత్రలో కృతి శెట్టి 
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ 
Bangarraju lyrical  song released

నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడవనుంది. పల్లెటూరి బుల్లోడుగా నాగార్జున సందడి చేయనున్న ఈ సినిమాలో, ఆయన వారసుడిగా చైతూ కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా కృతి శెట్టి అలరించనుంది.

ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగు టీజర్ ను రిలీజ్ చేశారు. "నా కోసం మారావా నువ్వు .. లేక నన్నే మార్చేశావా నువ్వు" అంటూ ఈ పాట సాగుతోంది. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించాడు. చైతూ .. కృతి శెట్టిపై సాగే పాట ఇది. డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం 5:12 నిమిషాలకు పూర్తి లిరికల్ సాంగును రిలీజ్ చేయనున్నారు.

నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీన విడుదల చేయాలనే ఉద్దేశంతో నాగార్జున ఉన్నారు. ఆయన సొంత బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగలక్ష్మి పాత్రలో కృతి శెట్టి లుక్ కి మంచి మార్కులు పడిపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News