ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఆసక్తికర ఘటన జరిగింది. అక్కడి ప్రభుత్వ కార్యాలయంలో ప్రవేశించిన ఓ మేక అందరినీ పరుగులు పెట్టించింది. ఆఫీసులో బల్లపై ఉన్న ఓ ఫైలును మేక తీసుకెళ్లడంతో అధికారులు లబోదిబోమన్నారు. అక్కడి సిబ్బంది ఆ ఫైలును తిరిగి తీసుకువచ్చేందుకు మేక వెంట పడ్డారు. అది పరుగులు తీయడంతో వారు కూడా దాంతో పాటు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.