Andhra Pradesh: ఏపీలో కొత్తగా 248 మందికి కరోనా

AP Corona Daily report
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 28,509 కరోనా పరీక్షలు నిర్వహించగా, 248 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 56 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 39, తూర్పు గోదావరి జిల్లాలో 38, చిత్తూరు జిల్లాలో 28 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం జిల్లాలో కొత్తకేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 253 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,446 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,55,856 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,158 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో 14,432 మంది మరణించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Report
Corona Virus
Daily Cases

More Telugu News