Nagachaitanya: 'థ్యాంక్యూ' సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్!

  • విక్రమ్ కుమార్ నుంచి 'థ్యాంక్యూ'
  • విభిన్నమైన ప్రేమకథా చిత్రం
  • చైతూ జోడీగా ముగ్గురు హీరోయిన్స్
  • ప్రధాన నాయికగా రాశి ఖన్నా
Thank You movie first look released

'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య - రాశి ఖన్నా జంటగా నటించారు. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. బలమైన ఎమోషన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో మరో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. వారే మాళవిక నాయర్ - అవికా గోర్. ఈ ఇద్దరి పాత్రలకి ప్రాధాన్యత ఉండటం విశేషం. ఈ రోజున చైతూ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా  నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చైతూ చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు.

విక్రమ్ కుమార్ తయారు చేసుకున్న ఈ కథ .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. అయితే ఇంతవరకూ ఆయన తన సినిమా నుంచి పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది లేదు. చాలా సైలెంట్ గా ఆయన తనపని చేసుకుంటూ వెళుతున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? ఎప్పటి నుంచి ప్రమోషన్స్ మొదలుపెడతారు? అనే విషయాలు అధికారికంగా వెలువడవలసి ఉంది.

More Telugu News