యూపీ ఎన్నికల్లో సింగిల్‌గానే బరిలోకి కాంగ్రెస్.. అన్ని స్థానాల్లోనూ పోటీ
- కాంగ్రెస్ ఒంటరిగానే విజయం సాధిస్తుందన్న ప్రియాంక గాంధీ
- అన్ని స్థానాలకు కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేస్తామన్న నేత
- ప్రియాంకను యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం
యూపీలోని అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న ప్రియాంక.. అన్ని స్థానాలకు కాంగ్రెస్ కార్యకర్తలనే నామినేట్ చేస్తామన్నారు. కాంగ్రెస్ ఒంటరిగానే విజయం సాధిస్తుందని అన్నారు. కాగా, యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 7 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా, 312 స్థానాలు గెలుచుకున్న బీజేపీ అధికారాన్ని చేపట్టింది.