Andhra Pradesh: ఏపీలో మరో 286 మందికి కరోనా పాజిటివ్

AP Corona daily update
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 37,540 కరోనా పరీక్షలు నిర్వహించగా, 286 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 37, విశాఖ జిల్లాలో 36, కృష్ణా జిల్లాలో 34, పశ్చిమ గోదావరి జిల్లాలో 33, గుంటూరు జిల్లాలో 30 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 307 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,69,352 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,51,747 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,196 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,409కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Bulletin
Today Cases
Corona Deaths
AP Corona

More Telugu News