దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

corona bulletin in inida
  • నిన్న11,466 క‌రోనా కేసులు
  • 460 మంది మృతి
  • మొత్తం 4,61,849 మ‌ర‌ణాలు
  • కేర‌ళ‌లో నిన్న 6,409 మందికి క‌రోనా  
దేశంలో కొత్త‌గా 11,466 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 460 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,39,683 మంది చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క‌రోనా నుంచి నిన్న 11,961 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 3,37,87,047 మంది కోలుకున్నట్టయింది.

క‌రోనా వ‌ల్ల దేశంలో మొత్తం 4,61,849 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న దేశంలో 52,69,137 డోసుల క‌రోనా వ్యాక్సిన్ వేశారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 109,63,59,208 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కేర‌ళ‌లో నిన్న 6,409 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయింది. 47 మంది ప్రాణాలు కోల్పోయారు.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News