Andhra Pradesh: ఏపీలో కొత్తగా 246 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona media update
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 28,855 కరోనా పరీక్షలు నిర్వహించగా, 246 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 80 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 41, గుంటూరు జిల్లాలో 31 కేసులు గుర్తించారు. అనంతపురం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 334 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,401కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,68,487 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,50,720 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,366 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Update
Bulletin
Today Cases

More Telugu News