పెళ్లింట విషాదం.. మనవడి వివాహమైన కాసేపటికే నానమ్మ మృతి.. విషయం తెలిసి తండ్రి హఠాన్మరణం
- అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో ఘటన
- వైభవంగా కుమారుడి వివాహం జరిపించిన తండ్రి
- ఆ తర్వాత కాసేపటికే వరుడి తండ్రి మృతి
మరోవైపు, అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటస్వామి తల్లి కోన్నమ్మ (70) మూడు రోజుల క్రితం అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. అయితే, అప్పటికే పెళ్లి సమయం దగ్గరపడడం, వాయిదా వేసుకునే అవకాశం లేకపోవడంతో బాధగానే వెంకటస్వామి తన కుమారుడి పెళ్లి జరిపించారు. ఈ క్రమంలో వివాహం ముగిసిన కాసేపటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి మరణించిందన్న వార్త వెంకటస్వామికి తెలిసింది. అది విన్నవెంటనే ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తల్లి, కుమారుడు మరణించడంతో పెళ్లింట విషాదం నెలకొంది.