Andhra Pradesh: ఏపీలో తాజాగా 215 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Update
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 30,831 కరోనా పరీక్షలు నిర్వహించగా, 215 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 37 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 33, విశాఖ జిల్లాలో 27, తూర్పు గోదావరి జిల్లాలో 26, గుంటూరు జిల్లాలో 24 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.

అదే సమయంలో 406 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,67,921 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,49,961 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,568 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,392కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Today Cases
Update

More Telugu News