కాస్త తక్కువగా తినండి.. దేశ ప్రజలకు కిమ్ సూచన
- ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార కొరత
- ఆకాశాన్నంటుతున్న ఆహార ధరలు
- 2025 వరకు తక్కువ ఆహారాన్ని తీసుకోవాలని సూచన
మరోవైపు కొరియాలో ఆహార కొరత తీవ్రంగా ఉందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం నివేదిక కూడా ఇచ్చింది. అయితే ఈ నివేదికను ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆమోదించలేదు. తమ దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. ఇదే సమయంలో దేశ ప్రజలకు కిమ్ కొన్ని సూచనలు చేశారు. 2025 వరకు అందరూ తక్కువ ఆహారం తీసుకోవాలని సూచించారు. చైనాతో సరిహద్దులు ఓపెన్ కావడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని... అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.