Vijay Sai Reddy: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు అడుగు పెట్టగానే పులి దిగింది, సింహం దిగిందంటూ అరువు నినాదాలు: విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా

vijay sai slams tdp
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయ‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు బృందానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లు దొరక‌లేద‌న్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ చంద్ర‌బాబుకు విజయ‌సాయిరెడ్డి చుర‌క‌లంటించారు. చంద్ర‌బాబును మీడియా కూడా ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.

'ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు అడుగు పెట్టగానే పులి దిగింది, సింహం దిగిందంటూ అరువు నినాదాలు. పడిగాపులు కాసినా కేంద్ర పెద్దల అపాయింట్‌మెంట్లు లేవు. మీడియా పట్టించుకోలేదు. అతని నైజం తెలియడంతో ఏ పార్టీ కూడా దరిచేరనీయలేదు. హడావుడి చేద్దామని వచ్చి అభాసుపాలై ఢిల్లీ నుంచి జారుకున్నాడు' అని విజయ‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News