డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్... ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా
- సంచలనం సృష్టించిన ముంబయి డ్రగ్స్ కేసు
- షారుఖ్ తనయుడు ఆర్యన్ సహా పలువురి అరెస్ట్
- రాజ్ గారియా, సాహులకు బెయిల్
- పెండింగ్ లో ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణ
ఆర్యన్ ఖాన్ కేసులా కాకుండా, మనీష్ రాజ్ గారియా కేసులో వాట్సాప్, ఐమెసేజ్ చాటింగులు ఏవీ లేవని అతడి తరఫు న్యాయవాది ముంబయి కోర్టుకు తెలిపారు. అవిన్ సాహు న్యాయవాది కూడా ఇదే తరహా వాదనలతో తన క్లయింటుకు బెయిల్ తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో, వాట్సాప్ చాటింగులే ఆర్యన్ ఖాన్ కేసులో సమస్యాత్మకంగా మారాయన్న విషయం అర్థమవుతోంది.