'దండుపాళ్యం' దారిలో 'తగ్గేదే లే'.. రేపు టీజర్ రిలీజ్!

Thaggede le teaser will release tomorrow
  • ప్రధాన పాత్రధారిగా నవీన్ చంద్ర
  • దర్శకుడిగా శ్రీనివాసరాజు
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  
ఈ మధ్య కాలంలో బాగా పాప్యులర్ అయిన డైలాగ్ .. 'తగ్గేదే లే'. 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్, జనంలోకి దూసుకుపోయింది. ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరగడానికి గల కారణాల్లో ఈ డైలాగ్ కూడా ఒకటి. అలాంటి ఆ డైలాగ్ నే టైటిల్ గా సెట్ చేసుకుని ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీనివాసరాజు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్ చూస్తే, 'దండుపాళ్యం' సినిమా గుర్తుకు వస్తుంది. అందుకు కారణం 'దండు పాళ్యం' 1 .. 2 ..3 సినిమాలను తెరకెక్కించిన దర్శకుడే ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ సారి ఈ సినిమాకి 'తగ్గేదే లే' అనే టైటిల్ ను సెట్ చేసుకున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. రేపు ఉదయం 10:08 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. నవీన్ చంద్ర .. రవిశంకర్ .. మకరంద్ దేశ్ పాండే .. పూజ గాంధీ ప్రధానమైన పాత్రలను పోషించారు.
Go Back to Shorts
Naveen Chandra
Pooja Gandhi
Ravi Shankar

More Telugu News