భారతీయుల సరాసరి ఎత్తు తగ్గిపోతోంది: ఆందోళనకర విషయాన్ని వెల్లడించిన అధ్యయనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారతీయుల సరాసరి ఎత్తు తగ్గిపోతోంది: ఆందోళనకర విషయాన్ని వెల్లడించిన అధ్యయనం

Indians average height is declining
  • జన్యుపరమైన కారణాలే కాకుండా ఇతర కారకాలు కూడా ప్రభావం చూపుతున్నాయని వెల్లడి
  • దేశంలోని వివిధ సమూహాల మధ్య ఎత్తులో కూడా తేడా
  • 15 నుంచి 25 ఏజ్ గ్రూపులో ఎత్తు తగ్గుదల
భారతీయుల సరాసరి ఎత్తు క్రమంగా తగ్గుతోందని ఓ అధ్యయనం ఆందోళనకర నిజాన్ని వెల్లడించింది. 1998 నుంచి 2015 వరకు భారతీయ వయోజనుల ఎత్తుపై నిర్వహించిన సర్వేలో కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. 1998-99లో ఎత్తు కొంచెం పెరిగిందని... అయితే 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో గణనీయమైన స్థాయిలో ఎత్తు తగ్గిందని వెల్లడించింది. ముఖ్యంగా పేద మహిళలు, గిరిజన మహిళల్లో ఈ క్షీణత ఎక్కువగా ఉందని తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా సరాసరి ఎత్తు పెరుగుతున్న తరుణంలో... భారతీయుల ఎత్తు మాత్రం తగ్గుముఖం చూసిందని సదరు అధ్యయనం తెలిపింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని... దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించింది. భారతీయ జనాభాలో వివిధ సమూహాల మధ్య ఎత్తు అంతరాయంపై కూడా అధ్యయనం జరగాలని చెప్పింది. జన్యుపరమైన అంశాలే కాకుండా... వాటికి సంబంధం లేని కారకాలు కూడా ఎత్తుపై ప్రభావం చూపుతున్నాయని... ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. ఈ ఇతర కారకాల్లో జీవన విధానం, పౌష్టికాహారం, సామాజిక, ఆర్థిక తదితర అంశాలు ఉన్నాయని చెప్పింది.

భారత్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వయోజనుల్లో సరాసరి ఎత్తులో తేడాలు ఉన్నాయని చెప్పింది. 15 నుంచి 25 ఏజ్ గ్రూపులో ఉన్న వారిలో ఎత్తు తగ్గుతోందని తెలిపింది. ఈ ఏజ్ గ్రూపులోని మహిళల సరాసరి ఎత్తు 0.42 సెంటీమీటర్లు, పురుషుల్లో 1.10 సెంటీమీటర్ల మేర సరాసరి ఎత్తు తగ్గించదని వెల్లడించింది.
Indians
Average Height
Decline
Study

More Telugu News