తెలంగాణలో కొత్తగా 248 కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 248 కరోనా కేసులు

Telangana covid media bulletin
  • గత 24 గంటల్లో 52,702 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 66 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 4,701 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 52,702 కరోనా పరీక్షలు నిర్వహించగా, 248 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 21, నల్గొండ జిల్లాలో 17 కేసులు గుర్తించారు. నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 324 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,64,898 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,56,285 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,701 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,912కి పెరిగింది.
Telangana
COVID19
Today Cases
New Cases
Deaths

More Telugu News