మ‌రోసారి హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్ ఫొటోలు వైర‌ల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌రోసారి హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్ ఫొటోలు వైర‌ల్

nayanatara pics go viral
  • విఘ్నేశ్‌ శివన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా న‌య‌న‌తార స‌ర్‌ప్రైజ్‌
  • పార్టీ ఇచ్చిన హీరోయిన్
  • న‌య‌న‌తార‌కు విఘ్నేశ్‌ థ్యాంక్స్  
ప్రేమలో మునిగి తేలుతున్న హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్ కు సంబంధించిన ఫొటోలు మ‌రోసారి వైరల్ అవుతున్నాయి. తాజాగా విఘ్నేశ్‌ శివన్ ప‌లు ఆసక్తికర ఫొటోల‌ను షేర్ చేశాడు. ఇందులో విఘ్నేశ్‌కు నయనతార పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ, ఆయ‌న పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేస్తూ క‌న‌ప‌డింది. విఘ్నేశ్‌ 36వ పుట్టినరోజు సందర్భంగా న‌య‌న‌తార  ఈ పార్టీ ఇచ్చింది. దీంతో ఆమెకు విఘ్నేశ్ థ్యాంక్స్ చెప్పాడు.

ఈ ఉనికి త‌న‌ జీవితంలో ఏ బ‌హుమ‌తితో పోల్చ‌లేనిదని అన్నాడు. త‌న పుట్టిన‌రోజును మరింత ప్ర‌త్యేకంగా మార్చినందుకు థ్యాంక్స్ చెప్పాడు. కాగా, త‌మ‌ నిశ్చితార్థం జ‌రిగింద‌ని ఇప్ప‌టికే ఈ జంట ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే వారి పెళ్లి జ‌ర‌గ‌నుందని వార్త‌లు వ‌స్తున్నాయి.  2015 నుంచి వారిద్ద‌రు ప్రేమించుకుంటున్నారు. గ‌తంలో గోవాతో పాటు ప‌లు ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో వారిద్ద‌రు చ‌క్క‌ర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ క‌న‌ప‌డ్డారు.  ప్ర‌స్తుతం వీరిద్ద‌రు సినిమాల్లో బిజీగా ఉన్నారు.

            
Nayanthara
Kollywood
Viral Pics

More Telugu News