Puri Jagannadh: పూరీ జగన్నాథ్, తరుణ్ లకు ఊరట... వారి శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవన్న ఎఫ్ఎస్ఎల్

FSL mentions no drugs elements in Puri Jagannath and Trun samples
షార్ట్స్‌లో చూడండి
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ ల శాంపిల్స్ లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) స్పష్టం చేసింది. పూరీ జగన్నాథ్, తరుణ్ ల నుంచి 2017లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించింది. వాటిని పరీక్షించిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక రూపొందించింది.

ఈ నివేదికను 2020 డిసెంబరు 8న రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు సమర్పించారు. డ్రగ్స్ సరఫరాదారుగా భావిస్తున్న కెల్విన్ పై చార్జిషీటులో ఈ మేరకు ఎక్సైజ్ శాఖ వివరాలు వెల్లడించింది. దీనిపై ఎఫ్ఎస్ఎల్ ఏడీ వాంగ్మూలాన్ని కూడా ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించింది.
Go Back to Shorts
Puri Jagannadh
Tarun
FSL
Drugs
Tollywood

More Telugu News