'హనుమాన్' ఫస్టులుక్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!
- తేజ సజ్జ హీరోగా 'హనుమాన్'
- దర్శకుడిగా ప్రశాంత్ వర్మ
- నిర్మాతగా నిరంజన్ రెడ్డి
- త్వరలో ఫస్టులుక్ రిలీజ్
'హనుమాన్' అనే ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. తేజ సజ్జ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా పనులతో ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన 'అంజనాద్రి'పై ఉన్న హనుమంతుడిని ఈ నెల 18వ తేదీ ఉదయం 10:08 నిమిషాలకు కలుసుకోమని చెప్పి ఒక పోస్టర్ ను వదిలాడు. ఆ సమయంలో ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నామని ఆయన ఇలా చెప్పి ఉండొచ్చు. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది.