'మాస్ట్రో' నుంచి ప్రమోషనల్ సాంగ్ ప్రోమో!
- అంధుడి పాత్రలో నితిన్
- కథానాయికగా నభా నటేశ్
- కీలక పాత్రలో తమన్నా
- ఈ నెల 17 నుంచి డిస్నీ హాట్ స్టార్లో
మహతి స్వరసాగర్ బీట్ బాగుంది. శ్రీమణి సాహిత్యాన్ని అందించగా రేవంత్ ఆలపించాడు. పూర్తి వీడియో సాంగ్ ను రేపు సాయంత్రం 5:04 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఆ మధ్య హిందీలో విజయాన్ని సాధించిన 'అంధదూన్' సినిమాకి ఇది రీమేక్. నభా నటేశ్ కథానాయికగా అలరించనుంది.
తమన్నా ఒక కీలకమైన పాత్రలో నటించగా, జిషూ సేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఒక ప్రత్యేకమైన పాత్రలో శ్రీముఖి మెరవనుంది. ఈ ఏడాదిలో ఇది నితిన్ నుంచి వస్తున్న మూడో సినిమా కావడం విశేషం. హిందీలో మాదిరిగానే తెలుగులోను ఈ సినిమా హిట్ కొడుతుందేమో చూడాలి.