కోట్లలో వచ్చిన కరెంటు బిల్లు చూసి దిగ్భ్రాంతికి గురైన టిఫిన్ హోటల్ యజమాని

Electricity bill in crores
  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
  • టిఫిన్ హోటల్ కు రూ.21 కోట్ల బిల్లు
  • అధికారులకు ఫిర్యాదు చేసిన మహిళ
  • మీటర్ రీడింగ్ ఉద్యోగిని, ఏఈని సస్పెండ్ చేసిన వైనం
సాధారణంగా చిన్నా చితకా హోటళ్లకు, నివాస గృహాలకు ఓ వెయ్యిలోపు కరెంటు బిల్లులు వస్తుంటాయి. మహా అయితే ఇంకో ఐదు వందలు ఎక్కువ వస్తుందేమో! కానీ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఓ టిఫిన్ హోటల్ కు వచ్చిన కరెంటు బిల్లు ఎంతో తెలిస్తే దిగ్భ్రాంతికి గురవుతారు. ఆ కరెంటు బిల్లు చూసిన టిఫిన్ హోటల్ నిర్వాహకురాలి పరిస్థితి కూడా అదే. సెప్టెంబరు మాసానికి రూ.21 కోట్ల మేర బిల్లు వేశారు. దాంతో ఆమె లబోదిబోమన్నారు.

వెంటనే ఈ సంగతి విద్యుత్ శాఖ అధికారులకు నివేదించడంతో వారు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆమె బిల్లును సరిచేసి కొత్త బిల్లు అందించేందుకు చర్యలు చేపట్టారు. అధికారులు భరోసా ఇచ్చిన తర్వాత గానీ ఆమె కుదుటపడలేదు.

ఈ బిల్లు తీయడంలో నిర్లక్ష్యం వహించాడంటూ చింతలపూడి మీటర్ రీడింగ్ ఉద్యోగి ప్రభాకర్ తో పాటు ఆ ప్రాంత ఏఈపైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సాంకేతికలోపం కారణంగానే ఇలాంటి బిల్లులు వస్తుంటాయని అధికారులు వివరించారు.
Go Back to Shorts
Electricity Bill
Crores
Tiffin Hotel
Chintalapudi
West Godavari District

More Telugu News