రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ

TTD issues Sarva Darshanam Tokens from tomorrow
  • కరోనా వల్ల ఏప్రిల్ లో టోకెన్ల జారీ నిలిపివేత
  • తాజాగా పునరుద్ధరణ
  • ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు అవకాశం
  • రోజుకు 2 వేల టోకెన్లు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రోజుకు 2 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు అవకాశం కల్పించనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ వెల్లడించింది.

తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లోని కౌంటర్లలో ఈ టోకెన్లు ఇస్తామని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 11 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ వర్గాలు నిలిపివేశాయి. కరోనా కేసులు తగ్గుతుండడంతో పునరుద్ధరించారు.
Go Back to Shorts
TTD
Sarva Darshanam Tokens
Tirumala
Temple

More Telugu News