కాంగ్రెస్ బలాన్ని తట్టుకోలేక కేసీఆర్ ఢిల్లీకి పోయి ఎన్నికలు వాయిదా వేసుకున్నారు: జగ్గారెడ్డి
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి
- కేసీఆర్ బీజేపీకి దగ్గరవుతున్నారని కామెంట్
- అధికారం కాపాడుకునేందుకేనని ఆరోపణ
- బండి సంజయ్ ఓ బకరా అంటూ వ్యాఖ్యలు
బండి సంజయ్ ఓ డమ్మీ నేత అని, ఢిల్లీ బీజేపీ పెద్దలు బండిని బకరా చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, అమిత్ షాల ఆటలో బండి బలైపోతారని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ మొదటి బకరా అయితే, ఈటల రాజేందర్ రెండో బకరా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ చేతుల్లో ఏమీలేదని, అంతా ఢిల్లీ చేతుల్లోనే ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.