వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ ను అరెస్ట్ చేసిన ఒడిశా పోలీసులు
- చిట్ ఫండ్ వ్యవహారంలో ఒడిశాలో ఫిర్యాదులు
- 2019లో విజయప్రసాద్ పై కేసు
- నేడు అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
- మేజిస్ట్రేట్ అనుమతితో ఒడిశా తరలింపు
మళ్ల విజయప్రసాద్ కు చిట్ ఫండ్ వ్యాపారం కూడా ఉంది. ఏపీలోనూ, పలు ఇతర రాష్ట్రాల్లోనూ బ్రాంచీలు ఏర్పాటు చేశారు. అయితే, తమకు చెల్లింపులు జరపడం లేదంటూ కొందరు డిపాజిట్ దారులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై రెండేళ్ల కిందటే ఒడిశాలో కేసు నమోదైంది.