నీట్ యథాతథం.... వాయిదా వేయాలన్న పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- సెప్టెంబరు 12న నీట్
- అదేరోజు ఇతర పరీక్షలు ఉన్నాయంటూ పిటిషన్లు
- పిటిషన్లను విచారణకు స్వీకరించలేమన్న సుప్రీం
- ఏదో ఒక పరీక్ష ఎంచుకోవాలంటూ సూచన
నీట్ పరీక్ష యథాతథంగా సెప్టెంబరు 12నే జరుగుతుందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 16 లక్షల మంది నీట్ రాస్తున్నారని, విద్యావ్యవస్థలపై తాము జోక్యం చేసుకుంటే ఆ ప్రభావం లక్షల మందిపై పడుతుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయినా ఏ కొందరి కోసమో నీట్ వాయిదా వేయడం సబబు కాదని అభిప్రాయపడింది. అందుకే ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించడం లేదని స్పష్టం చేసింది. ఒకేరోజున అనేక పరీక్షలు ఉన్నాయని పిటిషనర్లు అంటున్నారని, అలాంటప్పుడు ఏదో ఒకటే ఎంచుకోవడం మేలని సూచించింది.