తాలిబన్ల కాల్పుల్లో నేను గాయపడితే నా తలకు గురిపెట్టి రెండు రౌండ్లు కాల్చు... తన బాడీగార్డుకు సూచించిన ఆఫ్ఘన్ నేత అమృల్లా సలేహ్
- తాలిబన్లకు, పంజ్ షీర్ దళాలకు మధ్య పోరు
- పంజ్ షీర్ లోయలో ఉన్న అమృల్లా సలేహ్
- తాలిబన్లకు లొంగేది లేదని ప్రతిన
- తాజా పోరాటంలో తాలిబన్లకు తీవ్రనష్టం!
ఆఫ్ఘనిస్థాన్ లో అన్ని ప్రావిన్స్ లు తాలిబన్లకు లొంగిపోయినా, పంజ్ షీర్ మాత్రం పోరాటమే ఊపిరిగా సమరశంఖం పూరించింది. గడచిన 24 గంటల్లో తాలిబన్లు వందల సంఖ్యలో మరణించినట్టు కథనాలు వచ్చాయి. ఆఫ్ఘన్ దిగ్గజ కమాండర్ అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్ నేతృత్వంలోని పంజ్ షీర్ దళాలు తాలిబన్లను తరిమికొట్టేందుకు తీవ్ర పోరాటం సాగిస్తున్నాయి.