ట‌ర్కీ మంత్రిని క‌లిసిన‌ స‌ల్మాన్ ఖాన్‌, క‌త్రినా కైఫ్‌.. ఫొటోలు ఇదిగో
Add ap7am to your home Screen

ట‌ర్కీ మంత్రిని క‌లిసిన‌ స‌ల్మాన్ ఖాన్‌, క‌త్రినా కైఫ్‌.. ఫొటోలు ఇదిగో

salman meets turkish minister
  • టైగ‌ర్ 3 సినిమా షూటింగ్ కోసం ట‌ర్కీ వెళ్లిన బృందం
  • ఆహ్వానించి, ఆతిథ్య‌మిచ్చిన ట‌ర్కీ మంత్రి
  • స్వ‌యంగా ఫొటోలు పోస్ట్ చేసిన మంత్రి
'టైగ‌ర్ 3' సినిమా షూటింగ్ కోసం ట‌ర్కీ వెళ్లిన‌ బాలీవుడ్ న‌టులు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్.. ఈ సంద‌ర్భంగా వారు ఆ దేశ మంత్రితో దిగిన ఫొటోలు సామాజ‌క మాధ్య‌మాల్లో వైరల్ అవుతున్నాయి. టర్కీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి మెహ్మెత్ నూరి ఎర్సోయ్ ఆహ్వానం మేర‌కు టైగ‌ర్ 3 టీమ్ ఆయ‌న కార్యాల‌యానికి వెళ్లింది.

స‌ద‌రు మంత్రి స‌ల్మాన్, క‌త్రినాల‌తో కలిసి దిగిన ఫొటోను స్వ‌యంగా త‌న‌ సోష‌ల్ మీడియా ఖాతాల్లో  షేర్ చేయ‌డం గ‌మ‌నార్హం. త‌మ దేశ‌ ప‌ర్యాట‌క అభివృద్ధికి స‌హ‌క‌రిస్తోన్న వారికి తాము మంచి ఆతిథ్యం ఇస్తున్నామ‌ని చెప్పారు. మంత్రి మెహ్మెత్‌తో కాసేపు మాట్లాడిన టైగ‌ర్ 3 సినిమా బృందం ఆయ‌న ఇచ్చిన ఆతిథ్యానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్పెషల్ ఏజెంట్ అవినాశ‌క్ సింగ్ రాథోడ్ పాత్రలో స‌ల్మాన్ న‌టిస్తున్నాడు.  

              
Salman Khan
Katrina Kaif
Bollywood

More Telugu News