రేవంత్​, సండ్ర, తదితరులకు కోర్టు సమన్లు

Nampally Court Summons Revanth and TRS MLA
  • ఓటుకు నోటు కేసులో ఇచ్చిన నాంపల్లి కోర్టు
  • అక్టోబర్ 4న విచారణకు రావాలని ఆదేశం
  • మొత్తం ఆరుగురికి నోటీసులు
పీసీసీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లను జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో అక్టోబర్ 4న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్ ను కోర్టు ఇవాళ విచారించింది.

రేవంత్ తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకూ సమన్లను పంపింది. సెబాస్టియన్, ఉదయసింహ, ముత్తయ్య జెరూసలెం, వేం కృష్ణ కీర్తన్ లనూ విచారణకు రావాలని ఆదేశిస్తూ సమన్లను ఇచ్చింది.
Go Back to Shorts
Telangana
Revanth Reddy
Congress
TRS
Sandra Venkata Veeraiah

More Telugu News