Rohit Sharma: హెడింగ్లే టెస్టులో రోహిత్, పుజారా అర్ధసెంచరీలు
ఇంగ్లండ్ తో మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో అత్యంత పేలవంగా ఆడిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో గాడినపడినట్టే కనిపిస్తోంది. 60 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 162 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 59 పరుగులు చేసి, రాబిన్సన్ బౌలింగ్ లో అవుట్ కాగా, పుజారా 71 పరుగులతో ఆడుతున్నాడు. పుజారాకు జతగా కెప్టెన్ విరాట్ కోహ్లీ 15 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
అంతకుముందు, ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. రాహుల్ 8 పరుగులు చేసి ఒవెర్టన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 432 పరుగులకు ఆలౌట్ కాగా, 354 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం టీమిండియా ఇంకా 192 పరుగులు వెనుకబడి ఉంది.