హైదరాబాదీ క్రికెటర్​ సిరాజ్​ కు పాక్​ యాంకర్​ ఫిదా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదీ క్రికెటర్​ సిరాజ్​ కు పాక్​ యాంకర్​ ఫిదా!

Pakistani Anchor Lauds Mohd Siraj
  • పొగడ్తలతో ముంచెత్తిన జైనబ్ అబ్బాస్
  • ప్రపంచ స్థాయి బౌలర్ అంటూ ప్రశంసలు
  • అతడంటే తనకెంతో అభిమానమని కామెంట్
హైదరాబాద్ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ కు అభిమానులు పెరిగిపోతున్నారు. తాజాగా పాకిస్థాన్ కు చెందిన యాంకర్ అతగాడికి ఫిదా అయిపోయింది. సిరాజ్ పై ప్రశంసలు కురిపించింది. అతడంటే తనకు ఎంతో అభిమానమంటూ చెప్పుకొచ్చింది. స్వతహాగా స్పోర్ట్స్ యాంకర్ అయిన జైనబ్ అబ్బాస్.. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో సిరాజ్ పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకుంది.

అతడి గణాంకాలు అద్భుతమని పేర్కొంది. అతడి ప్రతిభకు లార్డ్స్ టెస్ట్ తో పాటు ఆస్ట్రేలియా సిరీస్ లో నమోదు చేసిన గణాంకాలే నిదర్శనమని వ్యాఖ్యానించింది. సిరాజ్ ఓ ప్రపంచ స్థాయి ఉత్తమ బౌలర్ అని కొనియాడింది. ప్రస్తుతం ఇంగ్లండ్ లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ లో ఆమె యాంకర్ గా చేస్తోంది. జైనబ్ స్వస్థలం లాహోర్. ఆమె తండ్రి నజీర్ పాక్ దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ఆడాడు. ఇంగ్లండ్ లోని వార్విక్ యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీలో ఎంబీఏ చేసినా.. తండ్రి క్రికెటర్ కావడంతో ఆమె స్పోర్ట్స్ వైపు అడుగులు వేసింది.

Cricket
Team India
Mohammed Siraj
Pakistan
Zainab Abbas

More Telugu News