సజ్జలకు చిత్తశుద్ధి ఉంటే జగన్ రూ. 43 వేల కోట్ల అవినీతిపై మాట్లాడాలి: వర్ల రామయ్య
- నేర రాజకీయాలపై సజ్జల మాట్లాడటం హాస్యాస్పదం
- తాలిబన్లకు మించిన అరాచకం ఏపీలో రాజ్యమేలుతోంది
- దేశంలో అత్యంత అవినీతిపరుడిగా జగన్ రికార్డులకెక్కారు
వైసీపీ అంటేనే నేరమయ రాజకీయాలకు, అసాంఘిక శక్తులకు నిలయమని వర్ల అన్నారు. వైసీపీ నేతల అవినీతిని అచ్చు వేస్తే పెద్ద గ్రంథమే అవుతుందని చెప్పారు. సజ్జలకు చిత్తశుద్ధి ఉంటే జగన్ అవినీతిపై విచారణ జరిపించాలని... షెల్ కంపెనీలు, క్విడ్ ప్రోకో అవినీతిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న కోర్టు ప్రశ్నకు సమాధానమివ్వాలని అన్నారు.