'గల్లీ రౌడీ' రిలీజ్ డేట్ వాయిదా!
- వచ్చేనెల 3న థియేటర్లలో నాలుగు సినిమాలు
- పోటీ నుంచి తప్పుకున్న 'గల్లీ రౌడీ'
- త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటన
- వచ్చే నెలలోనే రిలీజ్ ఉంటుందన్న నిర్మాతలు
ఆ రోజున ఎక్కువ సినిమాలు విడుదల కానుండటమే అందుకు కారణమని తెలుస్తోంది. 'నూటొక్క జిల్లాల అందగాడు' .. 'డియర్ మేఘ' సినిమాలు ఆ రోజునే విడుదల కానున్నాయి. ఇక అదే రోజున రావడానికి 'సీటీ మార్' కూడా సిద్ధమైంది. దాంతో ఇంత పోటీలో విడుదల చేయకూడదనే ఉద్దేశంతో, 'గల్లీ రౌడీ'ని వాయిదా వేసుకున్నారు.
అయితే ఈ సినిమాను వచ్చే నెలలోనే విడుదల చేయనున్నామనీ, త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు. సందీప్ కిషన్ సరసన నేహా శెట్టి నటించిన ఈ సినిమాలో, బాబీ సింహా - రాజేంద్ర ప్రసాద్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. 'జి. నాగేశ్వరరెడ్డి - సందీప్ కిషన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' మాదిరిగా ఈ సినిమా హిట్ కొడుతుందేమో చూడాలి.