మరోసారి క్రీడా సంరంభం... టోక్యోలో ప్రారంభమైన పారాలింపిక్స్
- సెప్టెంబరు 5వరకు పారాలింపిక్స్
- పాల్గొంటున్న 163 దేశాల అథ్లెట్లు
- 22 క్రీడాంశాల్లో 540 ఈవెంట్లు
- 54 మందితో బరిలో దిగుతున్న భారత్
నేటి నుంచి సెప్టెంబరు 5 వరకు జరిగే టోక్యో పారాలింపిక్స్ లో 163 దేశాల నుంచి 4,500 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. మొత్తం 22 క్రీడాంశాలకు చెందిన 540 ఈవెంట్లు నిర్వహించనున్నారు. భారత్ నుంచి 54 మంది బరిలో దిగుతున్నారు. గత పారాలింపిక్స్ లో రెండు స్వర్ణాల సహా భారత్ 4 పతకాలు గెలిచింది. ఈసారి భారత అథ్లెట్లు 9 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు.
