బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు.. 20న సోనియాతో నేతల భేటీ
- వర్చువల్‌గా సమావేశం
- హాజరుకానున్న పలువురు ముఖ్యమంత్రులు
- వివిధ అంశాలపై చర్చ
సానుకూలంగా స్పందించిన నేతలు హాజరవుతామంటూ తమ సమ్మతిని తెలియజేశారు. వీరితోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంటును కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వివాదం, నిర్ణీత సమయానికి రెండు రోజుల ముందే వర్షాకాల సమావేశాలు ముగియడం, లోక్‌సభ, రాజ్యసభ నిర్వహణ తీరుపై అధికార, విపక్షాల మధ్య పరస్పర నిందారోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి విపక్ష నేతలతో సమావేశం నిర్వహించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.