జమ్మూకశ్మీర్ లో ఆస్తులు కొన్న ఇతర రాష్టాల వ్యక్తులు!
- జమ్మూకశ్మీర్ లో ఆస్తులు కొన్న ఇద్దరు వ్యక్తులు
- పార్లమెంటులో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- ఆస్తులు కొనే సమయంలో వారికి ఇబ్బందులు ఎదురు కాలేదన్న కేంద్రం
జమ్మూకశ్మీర్ లో ఆస్తులు కొనాలనుకునే బయటివారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2019 ఆగస్టు తర్వాత ఇద్దరు బయటి వ్యక్తులు అక్కడ ఆస్తులు కొన్నారని ఆయన తెలిపారు. ఆస్తులు కొనేటప్పుడు వారికి ఇబ్బందులు ఎదురు కాలేదని చెప్పారు.