Devineni Uma: దేవినేని ఉమ వాహనంలో వెళుతుండగా ద్విచక్రవాహనంపై మహిళా అభిమాని విన్యాసాలు... వీడియో ఇదిగో!

  • జైలు నుంచి విడుదలైన దేవినేని ఉమ
  • వాహనంలో వెళుతుండగా వింత అనుభవం
  • స్కూటర్ పై సాహసాలు చేసిన మహిళ
  • జాగ్రత్త అంటూ వారించిన ఉమ
Woman worker adventures on scooter while Devineni Uma traveling

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఆయన వాహనంలో వెళుతుండగా ఓ మహిళా అభిమాని స్కూటర్ పై చేసిన విన్యాసాలు వైరల్ అవుతున్నాయి. ఆ మహిళా కార్యకర్త విన్యాసాలకు ఉమ కొద్దిగా ఆందోళనకు గురయ్యారు.

వాహనంలో ఉమ ప్రయాణిస్తుండగా, పక్కనే పసుపు రంగు స్కూటర్ పై ఆ మహిళ వేగంగా దూసుకెళ్లింది. నడుస్తున్న స్కూటీపై పైకి లేచి నిలబడడమే కాకుండా, ఒంటి చేత్తో నియంత్రిస్తూ తన అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేసింది. దాంతో, ఆమె సాహసకృత్యాల పట్ల వాహనంలో ఉన్న ఉమ కంగారు పడ్డారు. జాగ్రత్త అమ్మా అంటూ ఆ మహిళా అభిమానిని వారించే ప్రయత్నం చేశారు.

More Telugu News