జమ్మూకశ్మీర్‌లో మరోసారి కలకలం రేపిన 4 డ్రోన్లు
- సాంబా జిల్లాలోని బారి బ్రాహ్మణ ఏరియా వద్ద ఘటన
- ఆర్మీ క్యాంప్ వద్ద కూడా తిరిగిన వైనం
- 92 ఇన్ ఫాంట్రీ బ్రిగేడ్ కు సమాచారం ఇచ్చిన పోలీసులు
వాటిలో ఒకటి ఆర్మీ క్యాంప్ వద్ద కూడా తిరిగింది. డ్రోన్లు దూరంగా సంచరించడంతో కాల్పులు జరిపినా ప్రయోజనం ఉండదు. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసులు వాటిపై కాల్పులు జరపలేదని అధికారులు చెప్పారు. డ్రోన్ల సంచారంపై జమ్మూకశ్మీర్ పోలీసులు 92 ఇన్ ఫాంట్రీ బ్రిగేడ్ కు సమాచారం ఇచ్చారు. కాసేపటికి డ్రోన్లు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.