సింగరికోన మార్గంలో దంపతులపై చిరుత దాడి.. తీవ్ర గాయాలు
- ప్రముఖ పర్యాటక ప్రదేశమైన సింగరికోన
- వెనక నుంచి కారు రావడంతో బెదిరి పారిపోయిన చిరుత
- నగరికి చెందిన మరో జంటపైనా దాడి
- మార్గాన్ని తాత్కాలికంగా మూసేసిన అధికారులు
మార్గమధ్యంలో పొంచి వున్న ఓ పులి వీరిపై ఒక్కసారిగా దాడి చేయడంతో కిందపడ్డారు. అదే సమయంలో వెనక నుంచి ఓ కారు రావడంతో బెదిరిన చిరుత అక్కడి నుంచి పరారైంది. గాయపడిన దంపతులను వెంటనే పుత్తూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మధ్యాహ్నం నగరికి చెందిన మరో జంటపైనా పులి దాడికి యత్నించింది. విషయం తెలిసి అప్రమత్తమైన పోలీసులు, అటవీశాఖ అధికారులు సింగరికోన మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు.