కరోనా రోగులు టీబీ పరీక్షలు చేయించుకోండి... నూతన మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
- దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- తగ్గిన టీబీ అవగాహన ప్రచారం
- టీబీ కేసులు పెరుగుతున్నాయంటూ కథనాలు
- టీబీ రోగులు కరోనా పరీక్షలు చేయించుకోవాలన్న కేంద్రం
ఇక, కొవిడ్ కారణంగా టీబీ కేసులు పెరుగుతున్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. అయితే, కరోనా నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్ సోకుతున్నట్టుగానే, బాధితులు టీబీ బారినపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనా వ్యాప్తి భారత్ లో ప్రారంభం కాకముందు జాతీయస్థాయిలో టీబీ వ్యతిరేక కార్యక్రమాలు ఉద్ధృతంగా సాగేవి. అయితే, కరోనా రాకతో టీబీ అవగాహన ప్రచారం మందగించింది.