తెలంగాణలో కురుస్తున్న వర్షాలు.. 21న అల్పపీడనం
- నేడు, రేపు అక్కడకక్కడ భారీ వర్షాలకు అవకాశం
- నిన్న అత్యధికంగా మాగనూర్‌లో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం
- నాలుగు రోజుల తర్వాత మళ్లీ పెరగనున్న వానలు
ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, మహారాష్ట్రపై గాలులతో 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండగా తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల ద్రోణి ఉన్నట్టు అధికారులు వివరించారు. మరో నాలుగు రోజుల తర్వాత తెలంగాణలో వానలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపారు.