VV Vinayak: రేపు మొదలుకానున్న 'ఛత్రపతి' రీమేక్ .. గెస్టుగా రాజమౌళి!

  • తెలుగులో హిట్ కొట్టిన 'ఛత్రపతి'
  • ప్రభాస్ క్రేజ్ ను పెంచిన చిత్రం 
  • బెల్లంకొండ హీరోగా హిందీ రీమేక్ 
  • రేపు జరగనున్న పూజా కార్యక్రమాలు
Rajamouli is going to lounch for Chatrapathi hindi remake

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన కథాబలం కలిగిన చిత్రాలలో 'ఛత్రపతి' ఒకటి. 2005లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ప్రభాస్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను, ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా రేపు పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి వస్తున్నారని అంటున్నారు.

తెలుగులో మాస్ యాక్షన్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ మంచి మార్కులు సంపాదించుకున్నాడు. కొంతకాలంగా ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనే ఉత్సాహంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'ఛత్రపతి' కథను ఎంచుకున్నాడు. ఈ సినిమా రీమేక్ తో ఆయన బాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. మాస్ ఆడియన్స్ పల్స్ తెల్సిన దర్శకుడిగా వినాయక్ కి కూడా మంచి పేరు ఉంది. అందువలన ఈ ప్రాజెక్టు బాధ్యతలను ఆయనకి అప్పగించారు. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ మరింత ఫిట్ నెస్ సాధించాడు. ఇక బౌండ్ స్క్రిప్ట్ తో వినాయక్ సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.    

More Telugu News