Kiran Abbavaram: దూకుడు మీదున్న యంగ్ హీరో!

  • 'రాజావారు రాణిగారు'తో పరిచయం
  • విడుదలకి సిద్ధమైన 'ఎస్ ఆర్ కల్యాణ మండపం'
  • సెట్స్ పై 'సమ్మతమే'
  • లైన్లో 'సెబాస్టియన్'
Kiran Abbavaram upcoming movies update

కొంతకాలం క్రితం వచ్చిన 'రాజావారు రాణిగారు' సినిమాతో తెలుగు తెరకి కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా ఓ మాదిరిగా ఆడింది. ఆ తరువాత 'ఎస్ ఆర్ కల్యాణ మంటపం' సినిమాను చేశాడు. ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు కూడా అతనే అందించడం విశేషం. ఈ సినిమాలో ఆయన జోడీగా ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించింది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఆగస్టు 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాతో పాటు కిరణ్ అబ్బవరం మరో రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు. ఒకటి 'సమ్మతమే' .. మరొకటి 'సెబాస్టియన్'. రేపు కిరణ్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాల నుంచి అప్ డేట్స్ వదులుతూ వస్తున్నారు. రేపు ఉదయం 10.05 నిమిషాలకు 'సమ్మతమే' సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదలనున్నారు. ప్రవీణ నిర్మిస్తున్న ఈ సినిమాకి, గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కిరణ్ సరసన నాయికగా చాందినీ చౌదరి అలరించనుంది. ఇదంతా చూస్తుంటే కిరణ్ మంచి దూకుడు మీదే ఉన్నాడనే విషయం అర్థమవుతోంది.  

More Telugu News