గ్రామ సచివాలయాలపై ఏపీ హైకోర్టులో విచారణ... జీవో నెం.2ను సస్పెండ్ చేసిన ధర్మాసనం
- ఏపీలో గ్రామ సచివాలయాల ఏర్పాటు
- పంచాయతీల అధికారాలు సచివాలయాలకు బదిలీ
- జీవో జారీ చేసిన సర్కారు
- జీవోను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్
గతంలోనూ హైకోర్టు ఈ అంశంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఉండగా, సచివాలయాల పేరుతో మరొక వ్యవస్థ ఎందుకని ప్రశ్నించింది. రాష్ట్రంలో సమాంతర వ్యవస్థల అవసరమేంటని నిలదీసింది.