Venkatesh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఓటీటీ ద్వారా 'నారప్ప' వచ్చేస్తోంది 
  • 'లైగర్' క్లైమాక్స్ షూట్ కి సన్నాహాలు 
  • తమిళ హీరోతో 'జాతిరత్నాలు' దర్శకుడు     
Narappa to be released through Amezon

*  వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన 'నారప్ప' చిత్రం విడుదలపై సస్పెన్స్ వీడిపోయింది. ఈ చిత్రాన్ని డైరెక్టుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అమెజాన్ ప్రైమ్ ప్రమోషన్ కూడా మొదలుపెట్టింది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు.
*  పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతున్న 'లైగర్' చిత్రం షూటింగుకు సంబంధించి ఇక క్లైమాక్స్ మాత్రం మిగిలివుంది. 15 నిమిషాల పాటు సాగే ఈ దృశ్యాలను త్వరలో భారీ ఎత్తున సింగిల్ షెడ్యూల్ లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
*  ఆమధ్య వచ్చిన 'జాతిరత్నాలు' సినిమా ద్వారా పేరుతెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ త్వరలో కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ తో ఓ సినిమా చేయనున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో దీనిని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోపక్క, అనుదీప్ ప్రస్తుతం 'జాతిరత్నాలు' చిత్రానికి సీక్వెల్ కూడా చేస్తున్నాడు.

More Telugu News